IRAN- AMERICA : యుద్దం వ‌ల్ల అమెరికాకు అంత భారీ న‌ష్ట‌మా..?

america - iran

IRAN- AMERICA : ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్దం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇరాన్ పై ఓ వైపు అమెరికా, మ‌రోవైపు ఇజ్రాయెల్ భీక‌రంగా దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఏ దేశాల మ‌ధ్య అయినా యుద్ధం జ‌రిగితే దాని వ‌ల్ల చాలా న‌ష్టాలు క‌లుగుతాయి. ఈ యుద్దంలో కూడా అమెరికా భారీగానే ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు స‌మాచారం. IRAN- AMERICA

IRAN AMERICA AND ISRAEL WAR IS A HUGE LOSS TO AMERICA
ఇరాన్ పై చేసిన దాడికి అమెరికా తొలి 24 గంట‌ల్లోనే దాదాపు 779 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు అయినట్టు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు అంచెనా వేశాయి. తొలి రోజునే ఇంత ఖ‌ర్చు అయిందంటే.. ఇప్పటివ‌ర‌కు ఎంత ఖ‌ర్చు అయిందో అర్ధం చేసుకోవ‌చ్చు. భార‌త క‌రెన్సీ ప్ర‌కారం.. మొద‌టి రోజు ఖ‌ర్చు రూ.7,100 కోట్లు. యుద్ధం అధికారికంగా మొద‌ల‌వ్వ‌క ముందే 5,700 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. యుద్ధ నౌక‌లు, విమానాలు, వేల సంఖ్య‌లో సైనికుల‌ను ప‌శ్చిమాసియాకు త‌ర‌లించింది.

Also Read : BALINENI SRINIVAS REDDY : వైసీపీలో చేర‌నున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి..?

రెండేళ్లుగా ప‌శ్చిమాసియాలో జ‌రుగుతున్న గొడ‌వ‌ల కార‌ణంగా అమెరికాకు దాదాపు 3.1 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్టు స‌మాచారం. యుద్ధం కేవ‌లం గెలుపు, ఓట‌మిలే కాదు.. దేశాల ఆర్థిక భ‌విష్య‌త్ ను కూడా ప‌ణంగా పెట్ట‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ యుద్ధం ఎంత త్వ‌ర‌గా ముగిస్తే.. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అంత బాగుంటుంది. లేదంటే ఈ యుద్ధం వ‌ల్ల అగ్ర రాజ్యం కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ యుద్ధాన్ని ఎప్పుడూ ముగిస్తారో వేచి చూడాలి.

Also Read : CHANDRABABU NAIDU : ఉప ప్రధాని గా వెళ్లాలని చంద్ర‌బాబు ప్రయత్నాలు ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_