YOUNG GIRL : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో దారుణం.. డెలివ‌రీ అయిన‌ ఇంట‌ర్మీడియ‌ట్ అమ్మాయి

YOUNG GIRL : నాగర్‌కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వ‌చ్చింది. ప‌ద‌హారేళ్ల‌ ఇంటర్ అమ్మాయి ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లోని టాయిలెట్‌లోనే ప్రసవించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ చదివే విద్యార్థిని వైద్య పరీక్షలకు హాజరైంది. డాక్టర్లు పరీక్షించి కడుపులో గడ్డలు, ఇతర సమస్యలు ఉండవచ్చుననే అనుమానంతో స్కానింగ్‌ చేయించుకోవాలని చెప్పారు. దీంతో వారు సమీపంలోని ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఫీజు చెల్లించే ప్రక్రియ జరుగుతుండగానే.. బాలికకు తీవ్రమైన నొప్పులు రావడంతో వాష్‌రూంకి వెళ్లింది. వాష్‌రూంలోనే తల్లి సాయంతో బాలిక పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది.

Atrocious in Nagar Kurnool district.. Intermediate girl delivered

గర్భం దాల్చిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భ‌య‌ప‌డింది ఆ బాలిక‌. ఆమె తల్లి అప్పుడే పుట్టిన పసికందును అక్కడే ఉన్న చెత్త బుట్టలో పడేసింది. అనంతరం అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. వాష్‌రూం నుంచి వెలువడిన వింత శబ్దాలు, బాలిక తల్లి ప్రవర్తనను గమనించిన స్కానింగ్ సెంటర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.

Also Read : IRAN- AMERICA : యుద్దం వ‌ల్ల అమెరికాకు అంత భారీ న‌ష్ట‌మా..?
చెత్త బుట్టలో శిశువును చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రక్తస్రావంతో నీరసించిపోయిన బాలికను, శిశువును వెంటనే నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుప‌త్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్ల‌డించారు. దీంతో ఈ మైనర్ బాలిక గర్భం దాల్చడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేప‌ట్టారు.

Also Read : MINISTER SITAKKA : మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్నఫారెస్ట్ అధికారులు