
Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా.. దర్శకులుగా..నిర్మాతలుగా.. హీరోయిన్ గా.. కొనసాగుతున్న చాలామంది సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడినవారు ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా ఉన్నారు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కనీసం తినడానికి తిండి కూడా ఉండకపోయేదట.అలా చాలా సందర్భాలలో నాలుగైదు రోజుల వరకు తిండి లేకుండా పస్తులున్నారట.
Krishna Vamsi was made a hero in a movie just because he was fed for one day
అయితే దర్శకుడిగా మారకముందు ఏకంగా ఐదు రోజులు పస్తులు ఉన్నారట.అదే సమయంలో నటుడు బ్రహ్మాజీ తిందాం రా అని పిలవడంతోనే ఆకలికి ఆపుకోలేక వెంటనే ఆయనతో వెళ్లి అన్నం తిన్నారట.అయితే కృష్ణవంశీ సహజంగా ఆకలైనా కూడా ఎవరైనా పిలిస్తే అస్సలు వెళ్లేవారు కాదట. కానీ ఆరోజు ఏకంగా ఐదు రోజుల నుండి పస్తులు ఉండేసరికి బ్రహ్మాజీ పిలవడంతో వెళ్లకుండా ఉండలేకపోయారట. (Krishna Vamsi)
Also Read: Bunny: బన్నీ ఓపికకి ఆస్కార్ ఇచ్చినా పర్వాలేదు..పుష్ప-2 తర్వాత ఇన్ని సినిమాలా.?
అయితే బ్రహ్మాజీ అన్నం పెట్టినందుకు ఎలాగైనా అతని రుణం తీర్చుకోవాలని ఎంతో మదనపడేవారట. అలా ఫైనల్ గా సింధూరం మూవీలో హీరోగా ఛాన్స్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకున్నారట. అయితే సింధూరం సినిమా పెద్దగా హిట్టు కాక పోయినప్పటికీ సినిమాకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.

అయితే ఈ సినిమా యావరేజ్ హిట్ అయినప్పటికీ ఆ తర్వాత బ్రహ్మాజీకి తన సినిమాలో మంచి మంచి పాత్రలు ఇచ్చి రుణం తీర్చుకున్నారట కృష్ణవంశీ. ఇక ఈ విషయాన్ని ఓ సందర్భంలో చెప్పి బ్రహ్మాజీ చేసిన పనిని మెచ్చుకున్నారు. ఇక కృష్ణవంశీ ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు అందించారు. కానీ ప్రస్తుతం ఆయన ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. చివరిగా రంగమార్తాండ సినిమా తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.(Krishna Vamsi)

