
Smriti Mandhana: ప్రపంచం మెచ్చిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన జీవితంలో అనుకొని సంఘటన జరిగింది. పలాష్ ముచ్చల్ ని పెళ్లి చేసుకునే కొద్ది గంటల ముందే ఆమె తండ్రి హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ బారిన పడడంతో పెళ్లి వాయిదా పడింది. దాంతో వీరి పెళ్లి వార్తలపై ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా స్మృతి మంధానకి కాబోయే భర్త పలాష్ మచ్చల్ వేరే అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పలాష్ ముచ్చల్ ని పట్టుకున్న స్మృతి మంధాన తండ్రి అతన్ని నిలదీయగా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి చివరికి స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చినట్టు ప్రచారం జరిగింది.
Will what happened in Samantha Chaitula life also happen in Smriti Mandhana Palash life
అయితే ఈ ప్రచారంలో ఎంత నిజముందో తెలియదు కానీ పలాష్ ముచ్చల్ తల్లి త్వరలోనే స్మృతి మంధాన మా ఇంటి కోడలు కాబోతుందని రీసెంట్గా బయటపెట్టింది. అయితే ఇప్పటివరకు స్మృతి మంధాన ఇంటి తరఫునుండి ఎవరూ కూడా ఈ పెళ్లి రూమర్లపై స్పందించడం లేదు. (Smriti Mandhana)
Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జీవితం నాశనం చేసింది ఈ లేడీనే ?
ఇదంతా పక్కన పెడితే తాజాగా స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ ఇద్దరు తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో బ్లూ ఐ అంటే కను దిష్టి అర్థం వచ్చేలా బ్లూ ఐ ఎమోజిని షేర్ చేశారు.. అయితే ఈ ఎమోజీ ని ఇద్దరు ఒకేసారి పెట్టడంతో చాలామంది నెటిజెన్లు ఇదేంటి ఇన్ని రోజులుగా ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి.వీరిద్దరి మధ్య గొడవలు జరగలేదా..అదంతా ఫేక్ ప్రచారమేనా.. వీరు కలిసే ఉన్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇక మరికొంతమందేమో సమంత చైతుల జీవితంలో జరిగినట్టే వీరి పర్సనల్ లైఫ్ కి కూడా ఎవరి దిష్టో తగిలింది. నర దిష్టి తగిలితే ఎంత వాళ్ళు అయినా సరే అడుగున పడిపోతారు. అలా స్మృతి మందాన పలాష్ జీవితంలో కూడా జరిగినట్టుంది. ఈ జంటకు దిష్టి తగలడం వల్లే పెళ్లి వాయిదా పడింది అంటూ మాట్లాడుకుంటున్నారు.(Smriti Mandhana)





