Amala Paul: 17 ఏళ్లకే తప్పు చేశా.. పేరెంట్స్ బాధ పడ్డారంటూ అమలాపాల్ ఓపెన్ కామెంట్స్.!

Amala Paul open comments that she made a mistake at the age of 17
Amala Paul open comments that she made a mistake at the age of 17

Amala Paul: సౌత్ బ్యూటీ అమలాపాల్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఇక అమలాపాల్ తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా రామ్ చరణ్,అల్లు అర్జున్, నాగచైతన్యలతో నటించి ఫేమస్ అయిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నేను 17 ఏళ్లకే తప్పు పని చేశా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ 17 ఏళ్లకే అమలాపాల్ చేసిన తప్పేంటి అనేది చూస్తే..

Amala Paul open comments that she made a mistake at the age of 17

అమలాపాల్ తన 17 ఏళ్ల వయసులో సింధు సమవేలీ అనే బోల్డ్ మూవీలో నటించింది.ఈ సినిమాలో అమలాపాల్ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది. అయితే ఆ సమయంలో అమలాపాల్ కి కేవలం 17 ఏళ్లు మాత్రమే కావడంతో ఆమెకి ఇంకా మెచ్యూరిటీ మైండ్ లేకపోవడంతో దర్శకుడు ఏం చెబితే అది చేయడానికి తలాడించిందట.అలా ఆ సినిమాలో ఆ పాత్రలో నటించిందట. (Amala Paul)

Also Read: Smriti Mandhana: సమంత చైతూల జీవితంలో జరిగిందే స్మృతి పలాష్ ల జీవితంలో కూడా జరుగుతుందా.?

అలా సినిమాల్లో కనిపిస్తాననే ఉద్దేశంతో కథ ఏంటో తెలియకుండానే దర్శకుడు చెప్పిన పనిచేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఈ సినిమా వచ్చిన సమయంలో అమలాపాల్ పై ఎన్నో విమర్శలు రావడమే కాకుండా డైరెక్టర్ ని కూడా చాలా మంది తిట్టారు.ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ..

Amala Paul open comments that she made a mistake at the age of 17

ఆ సమయంలో నా వయసు చాలా తక్కువ కావడంతో దర్శకుడు చెప్పింది చేశాను. కానీ ఈ సినిమా చేయడం వల్ల నేను ఎన్నో విమర్శలు మూట కట్టుకోవడంతోపాటు నా ఫ్యామిలీ కూడా చాలా బాధపడింది. ఆ సినిమా సమయంలో వచ్చిన విమర్శలు విన్నాక ఇంకొకసారి ఇలాంటి సినిమాల్లో నటించకూడదు అని ఫిక్స్ అయ్యాను అంటూ అమలాపాల్ చెప్పుకొచ్చింది.(Amala Paul)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_