Egg Freezing: కృతి సనన్ తన ఆరోగ్యం కోసం తీసుకున్న నిర్ణయం

ఆ టైంలో అందాలను భద్రపరుచుకున్న: కృతి సనన్

బాలీవుడ్ నటి కృతి సనన్ తన వ్యక్తిగత జీవితంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆమె ఇటీవల పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ, ‘మిమి’ సినిమా కోసం షూటింగ్ సమయంలో తన అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరుచుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న చర్యగా కృతి సనన్ వివరించింది. సినిమా పాత్ర కోసం బరువు పెరగడం వల్ల భవిష్యత్తులో గర్భం దాల్చే సమయంలో సమస్యలు రాకూడదని ఆమె ముందస్తు జాగ్రత్తగా ఈ పద్ధతిని ఎంచుకుంది.

‘మిమి’ చిత్రంలో కృతి సనన్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఈ పాత్ర కోసం ఆమె బరువు పెరగడంతో పాటు ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవలసి వచ్చింది. దీని వలన కడుపు ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే తన శారీరక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కృతి, ఒక స్నేహితుడు సూచించిన మేరకు అండాలను ఫ్రీజ్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను తనకు తాను ఇచ్చుకున్న అత్యుత్తమ బహుమతిగా అభివర్ణించింది.

సినిమాల్లో నటీమణులు శారీరక మార్పులు చేసుకోవడం సాధారణం. అయితే ఇటువంటి మార్పులు హార్మోన్ల ఇంజెక్షన్ల వల్ల అండాశయంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కృతి సనన్ ఈ విషయాన్ని గుర్తించి, తన కెరీర్ పట్ల అంకితభావం చూపిస్తూనే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించింది. ఇప్పుడు చాలా మంది నటిమణులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇది వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేలా సహాయపడుతుంది.

‘మిమి’ సినిమా కథలో కృతి సనన్ పోషించిన పాత్ర అద్దె గర్భం (సరోగేట్) ఇవ్వడానికి అంగీకరించే యువతిది. సమాజం నుండి వచ్చే విమర్శలను ఎదుర్కొంటూ ఆమె తన కథను నడిపిస్తుంది. ఈ చిత్రం కృతి కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కృతి సనన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సినీ ప్రియుల్లో చర్చనీయాంశమైంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu