
Egg: గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. గుడ్డులో ఆరు నుంచి ఏడు గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఐదు గ్రాముల కొవ్వు పదార్థం ఒక గుడ్డులో ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి అధికంగా ఉంటాయి. గుడ్డులో ఉండే విటమిన్లు కంటి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. గుడ్డు పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు. గుడ్డులోని కొవ్వు ప్రధానంగా పచ్చ సోనలో ఉంటుంది. అందుకే కొంతమంది తెల్ల సోన మాత్రమే తింటారు. అయితే గుడ్డులో కొవ్వు చాలా వరకు ఉంటుంది. గుడ్డులో ఉండే కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలుగుతుంది. Egg
Can you eat egg raw Is it better to cook them
కొంతమందికి గుడ్డు తింటే అసలు పడదు అలర్జీ సమస్యలు వస్తాయి. కొంతమంది చిన్నపిల్లలకు కూడా గుడ్లు తినిపించడం వల్ల అలర్జీ సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి గల ప్రధాన కారణం గుడ్డులో ఉండే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు. ఇది కొంతమందికి అలర్జీ సమస్యలను తీసుకువస్తాయి. గుడ్డు పడకపోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. చర్మం ఎర్రగా మారుతుంది. కొంతమందికి గుడ్డు వాసన పడదు దానివల్ల వాంతులు అవుతాయి. గుడ్డు తినడం వల్ల కొంతమందికి వీరేచనాలు కూడా అవుతూ ఉంటాయి. అలాంటివారు గుడ్డు తినకపోవడం మంచిది. అలాంటి వారికి గుడ్డు అసలు పడదని అర్థం చేసుకోవాలి. గుడ్డు పడని వారు దానిని అస్సలు తినకూడదు. అలాంటి వారిలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దానివల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. గుడ్డును ఉడికించి తిన్నట్లయితే చాలా సులభంగా జీర్ణం అవుతుంది. కానీ కొంతమంది పచ్చి గుడ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్ముతూ ఉంటారు. పచ్చి గుడ్డు ఆరోగ్యానికి మంచిదే కానీ వాటిలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. Egg
Also Read: Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో సంచలనం..234 కొత్త ఫోన్లే కొంపముంచాయా ?
ఇది చర్మ సమస్యలకు దారితీస్తుంది. దానివల్ల వీరేచనాలు, తీవ్రమైన జ్వరం సమస్యలు వస్తాయి. అందువల్ల గుడ్లను ఉడికించి తినడం కన్నా ఆమ్లెట్ వేసుకొని తిన్నట్లయితే చాలా మంచిది. ఉడికించిన గుడ్డు పడని వారు కూడా ఆమ్లెట్ వేసుకొని తిన్నట్లయితే వారికి తేలికగా జీర్ణం అవుతుంది. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఉడికించిన గుడ్డు తినడానికి చిన్న పిల్లలు కూడా అసలు ఇష్టపడరు. అలాంటి వారికి ఆమ్లెట్ వేసే తినిపించినట్లయితే వారి ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చిన్నపిల్లలకు కూడా ఆమ్లెట్ చాలా తేలికగా జీర్ణం అవుతుంది. వారంలో రెండు మూడుసార్లు ఆమ్లెట్ వేసి చిన్న పిల్లలకు తినిపించినట్లయితే వారి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. Egg
Also Read: Green chilies: పచ్చిమిరపకాయలు తింటున్నారా.. అయితే 100 రోగాలకు చెక్ ?




