KTR: ఏపీలో నీటి సంక్షోభంలో రైతులను కాపాడిన పట్టిసీమకు కేటీఆర్ ప్రశంసలు!!

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

తెలంగాణ BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల ప్రయత్నాలను హైలైట్ చేస్తూ ప్రశంసలు కురిపించారు. ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గి నీటి కొరత ఏర్పడినా, ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతులను కాపాడుతుందని ఆయన అన్నారు.

KTR praises AP irrigation efforts

ప్రస్తుతం కృష్ణాల్టా ఏరియాలో నీటి ప్రవాహం తగ్గడంతో సాగుపై అనిశ్చితి నెలకొంది. పులిచింతలలో 32 టీఎంసీల నీరు మాత్రమే ఉంది, ఇది లక్షల ఎకరాలకు సరిపోదు. ఈ సిచ్యువేషన్లో 2015లో ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రత్యామ్నాయంగా మారింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఇదే బ్యాకప్ అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వం రైతుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేస్తుందని, సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ కితాబిచ్చారు. అయితే అదే టైంలో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఏపీలా పెర్ఫార్మ్ చేయడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.

ఎల్‌నినో ఎఫెక్ట్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్లానింగ్ చేయాలని, నీటిపారుదల డిపార్ట్‌మెంటు మరింత ఎఫిషియెంట్‌గా పని చేయాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. ఈ ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద డిస్కషన్‌గా మారింది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu