Toxic: యష్ ‘టాక్సిక్’ ఫ్యామిలీ సినిమా నా.. మరిదంతా ఎందుకు?

యశ్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మారుతుందా అనే డౌట్ ఫ్యాన్స్లో మొదలైంది. KGF తర్వాత రాబోతున్న ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, పాటలు చూస్తే ఇదో అడల్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా అనుకున్నారు. కానీ యశ్ స్వయంగా బాలీవుడ్ ఇంటర్వ్యూలో చెప్పిన కథ విని అందరూ షాక్ అయ్యారు. ఈ సినిమా ఆగస్ట్ 26న రిలీజ్ కానుంది.

Toxic is a Family Entertainer? Yes

యశ్ చెప్పినట్లుగా, ఈ సినిమా 1947 తర్వాత కూడా పోర్చుగీస్, ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలో ఉన్న ఇండియన్ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. అధికారం కోసం జరిగే గ్యాంగ్స్టర్ వార్ ఇది. కానీ అందులో బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్, తండ్రి-కొడుకు రివెంజ్, లవ్ స్టోరీ కూడా ఉంటాయని తెలిపాడు. అంటే ఇది పూర్తిగా పాపులర్ ఎంటర్టైనర్ మూవీ అని అర్థం. తబాయి సాంగ్ చూస్తే కియారా అద్వానీ యశ్ లవర్ రోల్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు – నయనతార, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ. వీరిలో నలుగురు ఏ పాత్రలు పోషిస్తున్నారో సస్పెన్స్గా ఉంది. యశ్ సిస్టర్ పాత్ర ఎవరిది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎవరైనా పోర్చుగీస్ వాళ్ళు, ఇండియన్స్ మధ్య బిజినెస్ డీల్స్ బ్యాక్డ్రాప్లో ఈ కథ నడుస్తుందని యశ్ వివరించాడు.

మొత్తానికి, ఇది అడల్ట్ మూవీ అనుకున్నాము కానీ బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్తో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టాక్సిక్ చూడొచ్చు. డైరెక్టర్ గీతు మోహన్దాస్ ఈ కథని ఎలాంటి అండర్ వరల్డ్ టచ్తో ప్రెజెంట్ చేస్తారో చూడాలి. యశ్ ఫ్యాన్స్కి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయినట్లు కనిపిస్తుంది.

Share your love