Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో సంచ‌ల‌నం..234 కొత్త ఫోన్లే కొంప‌ముంచాయా ?

Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో మరో సంచలన విషయం బ‌య‌ట‌ప‌డింది. బస్సు లగేజ్‌ విభాగంలో ఉంచిన 234 కొత్త మొబైల్‌ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని తెలిపారు అధికారులు. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేశార‌ని స‌మాచారం అందుతోంది. ఇక‌ అవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంద‌ని తెలుస్తోంది. Kurnool Bus Accident

Kurnool Bus Accident 234 new phones are all over the place

కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని తెలిపారు ఫోరెన్సిక్‌ నిపుణులు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని తెలిపారు ప్రత్యక్ష సాక్షులు. మొబైల్‌ ఫోన్ల పేలుళ్లు మాత్రమే కాకుండా, బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్‌ బ్యాటరీలు కూడా పేలిపోయాయని ఏపీ‌ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ పి. వెంకటరమణ స్ప‌ష్టం చేశారు. Kurnool Bus Accident

Also Read: Ravi tree: రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు.. లేదంటే దరిద్రం…

ఇది ఇలా ఉండ‌గా, కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అరెస్ట్ అయ్యాడు. 5వ తరగతి వరకే చదువుకుని, నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్ పొందిన లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్యను తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. Kurnool Bus Accident

Also Read: Alcohol: ఆకలితో ఉన్నప్పుడు మద్యం సేవిస్తున్నారా…అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి?

Share your love