
Hero: ఆయన ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.ఎంతో మంది స్టార్ హీరోలకు పోటీ వచ్చారు అని అనుకున్నారు. కట్ చేస్తే ఆ హీరో కెరియర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. చేయని తప్పుకు జైలుకు వెళ్లడంతో ఆయన కెరియర్ తారుమారైపోయింది. ఇక ఇప్పటికే ఆ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆయనే సీనియర్ నటుడు సుమన్..
Big breaking black magic on star Hero
అందానికి అందం ఒక హీరో మెటీరియల్ ఎలా ఉండాలో అచ్చం అలాగే ఉండి ఎంతోమంది అమ్మాయిలను ఫిదా చేసిన సుమన్ ఒకప్పుడు హిట్ సినిమాలతో దూసుకుపోయాడు. అంతే కాదు ఈయన చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ లకు పోటీ అని ఎంతోమంది గొప్పగా పగిడారు.కానీ అలాంటి సుమన్ కెరియర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. దానికి కారణం చేయని తప్పులో ఆయన జైలుకు వెళ్లడమే.బ్లూ ఫిలిమ్స్ కేసులో ఆయన జైలుకు వెళ్లి మూడు నెలలు జైలు జీవితం గడపారు. ఆ తర్వాత ఆయన కెరియర్ అస్తవ్యస్తమైపోయింది.(Hero)
Also Read: Suman: ఆ హీరో తో ఎలాంటి విభేదాలు లేవు.. గొడవల పుకార్లకు సుమన్ఎండ్ కార్డ్!!
సినిమా అవకాశాలు రాలేదు. దాంతో హీరోగా ఆయన్ని పెట్టుకున్న చాలామంది దర్శక నిర్మాతలు కూడా పక్కన పెట్టేశారు. అయితే అలాంటి సుమన్ కెరియర్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో చేస్తూనే సీరియల్స్ లో కూడా చేస్తున్నారు.అయితే ఈయన కెరియర్ ఇలా అవడానికి కారణం చేతబడట. ఒక జ్యోతిష్యుడు సుమన్ ని చూసి నీపై చేతబడి చేశారు అని మొహం పట్టుకొని చెప్పారట. కానీ ఆయన పేరు ఏంటి అనేది మాత్రం బయట పెట్టలేదు.

అలా ఎవరో తన స్టార్డం ని ఓర్వలేక అలా చేతబడి చేయించారని కానీ వారికి నా పాపం కచ్చితంగా తగులుతుంది అని సుమన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంతేకాదు తనపై జరిగే చేతబడి కి కేరళ వెళ్లి విరుగుడు చేయించుకున్నారట. ఇక ఈ విషయాన్ని సుమన్ బయట పెట్టడంతో చాలామంది నెటిజన్లు రకరకాల హీరోల పేర్లు కామెంట్లలో పెడుతూ వాళ్లే మీకు చేతబడి చేయించారు అంటూ వైరల్ చేస్తున్నారు(Hero)

