Lenin: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో అఖిల్ సినిమాకు అదిరిపోయిన ఫస్ట్ టాక్

లెనిన్ ఫస్ట్ టాక్‌లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకు అదిరిపోయిన బజ్ తెచ్చింది. అక్కినేని అఖిల్ హీరోగా మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అమెరికా ప్రీమియర్ తర్వాత సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్‌లో మ్యాన్ ఆఫ్ మేసెస్ ఎన్టీఆర్ గొంతు వినిపించడం ప్రేక్షకులను వెంటనే కథలోకి డ్రా చేసింది. అఖిల్ కెరీర్‌లో ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని తొలి స్పందనలు సూచిస్తున్నాయి.

గతం లో క్లాసీ ఇమేజ్ తో కనిపించిన అఖిల్, ఈసారి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో అతని కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది. ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్, ఫ్రెండ్‌షిప్ సీన్స్ నేచురల్ గా సాగాయని టాక్. ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సినిమా మరో లెవెల్ కి వెళుతుందని చూసిన వారు చెప్తున్నారు.

సెకండ్ హాఫ్ మరింత వేగంగా సాగడంతో పాటు వరుస ట్విస్టులు ఆసక్తిని పెంచాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్ సీన్స్ బాగా టచ్ అయ్యాయని రిపోర్ట్. సంగీత దర్శకుడు ఎస్.థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు రంగులు చేర్చింది. సీనియర్ హీరో శివాజీ పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ గా లెనిన్ సినిమా అఖిల్‌కు కొత్త డైరెక్షన్ ఇస్తుందని ఫస్ట్ టాక్ సూచిస్తోంది.

Share your love