లెనిన్ సినిమా పేరు వెనుక ఉన్న నిజమేంటి? అఖిల్ చెప్పే ఆసక్తికర విషయాలు

లెనిన్ సినిమా పేరు వెనుక ఉన్న నిజమేంటి? అఖిల్ చెప్పే ఆసక్తికర విషయాలు

లెనిన్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త రాక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ చిత్రం 10న అత్యంత భారీ స్థాయిలో జూలై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తితో పాటు పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘లెనిన్’ అనే పేరు వినగానే ఇది రాజకీయ నేపథ్యమున్న సినిమానో లేదా కమ్యూనిజం సిద్ధాంతాల గురించిన కథో అయిందని సినీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని హీరో అఖిల్ స్వయంగా వెల్లడించి అందరి అనుమానాలకు పూర్తి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా టైటిల్‌కు ఎలాంటి పొలిటికల్ కనెక్టివిటీ లేదు, ఇది పూర్తిగా ఒక కల్పిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమని అఖిల్ స్పష్టం చేశారు. దర్శకుడు నందు గారి స్వగ్రామమైన రాయలసీమ తాను వెళ్ళినప్పుడు అక్కడ ‘లెనిన్ బాబు’ అనే ఒక వ్యక్తిని కలిసానని, ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు లేదా ఆ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన కుటుంబాలు తమ పిల్లలకు లెనిన్, స్టాలిన్ వంటి పేర్లు పెట్టడం చాలా సాధారణమని ఆయన వివరించారు. అలా రాయలసీమలో ఇది చాలా కామన్ పేరుగా మారిపోయిందని అఖిల్ తెలిపాడు.

దర్శకుడు నందుకు ఈ పేరు పట్ల ఉన్న ప్రత్యేక ఇష్టం, గౌరవంతోనే ఈ టైటిల్‌ను ఎంచుకున్నట్లు అఖిల్ తెలిపారు. కథ ప్రకారం సమాజంలో ఒక బలమైన శక్తిగా ఎదిగి, సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలతో ప్రజలను నడిపించే ఒక పవర్‌ఫుల్ కుర్రాడి పాత్రకు ఈ పేరు స’రిపోతుందని భావించి ‘లెనిన్’ అని ఫిక్స్ చేశారు. ఈ పేరు కేవలం కమ్యూనిజానికి మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన లీడర్‌షిప్‌కు ప్రతీకగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.

భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందించబడింది. అఖిల్ తన కెరీర్‌లోనే అత్యంత మాస్ లుక్‌లో, పక్కా సీమ యాసతో అలరించనున్నారు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సరికొత్త కథాంశంతో, అఖిల్ సరికొత్త మేకోవర్‌తో రాబోతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూలై 10న థియేటర్లలో సందడి చేయడానికి సర్వం సిద్ధమైంది.

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment