
Shiva Jyothi: ఎవరైనా మతాన్ని కించపరిస్తే ఖచ్చితంగా ఆ మతస్తులు అస్సలు ఊరుకోరు. ముఖ్యంగా హిందువులైనా.. ముస్లింలైనా.. క్రిస్టియన్స్ అయినా.. ఎవరైనా సరే ఉవ్వెత్తున ఎగిసి పడతారు. అలా తాజాగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని యాంకర్ శివ జ్యోతి అవమానించేలా మాట్లాడడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తిరుమల భక్తులు హిందూ బాంధవులందరూ శివ జ్యోతిని ఏకిపారేస్తున్నారు. మరి ఇంతకీ శివజ్యోతి చేసిన తప్పేంటంటే..
Tirumala devotees angry over anchor Shiva Jyothi
తాజాగా ప్రెగ్నెన్సీ లో ఉన్న శివజ్యోతి తన ఫ్రెండ్స్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అలా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన సమయంలో క్యూ లైన్ లో ఇచ్చే అన్నప్రసాదాన్ని తీసుకొని నేను కాస్ట్లీ ప్రసాదాన్ని అడుక్కుంటున్నా..మనం రిచెస్ట్ బెగ్గర్స్ అంటూ వెక్కిలి నవ్వులు నవ్వుతూ వెక్కిలి చేష్టలు చేసింది. (Shiva Jyothi)
Also Read: Varanasi Movie: వారణాసి మూవీ స్టోరీ మొత్తం లీక్.. జక్కన్నకు పెద్ద చిక్కచ్చి పడిందిగా.!
అంతేకాదు ఆ ప్రసాదాన్ని తింటున్నప్పుడు భక్తితో మనస్ఫూర్తిగా తినకుండా వెక్కిలి నవ్వులు నవ్వడమే కాకుండా ఎగతాళిగా నవ్విన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చూసి ఫుల్ కోపం వచ్చేస్తుంది. అంతేకాదు ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది శివజ్యోతిని ఏకిపారేస్తున్నారు.ఆ స్వామి వారి అన్నప్రసాదాన్ని ఎంతో మంది మహాప్రసాదంగా స్వీకరిస్తారు.

కానీ నీవు మాత్రం పొగరుతో ఆ ప్రసాదాన్ని అడుక్కోవడం,బెగ్గర్లతో పోలుస్తూ శ్రీవారి మహా ప్రసాదాన్ని అవమానించావు అంటూ మండిపడుతున్నారు. అంతే కాదు వెంటనే హిందువులకు తిరుమల భక్తులకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి శివ జ్యోతి చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం మీడియా ముందుకు వచ్చే క్షమాపణలు చెబుతుందా.. లేక ఈ గొడవలు మరింత పెద్దది చేసుకుంటుందా అనేది చూడాలి.(Shiva Jyothi)



Hema: నాగార్జున మా అమ్మాయి ఫంక్షన్ కి వస్తే వెళ్లగొట్టాను.. హేమ షాకింగ్ కామెంట్స్.!