NEET Paper Leak: దేశవ్యాప్త ఆందోళనల నడుమ చంద్రబాబు-మోడీ సంచలన సమావేశం

NEET Paper Leak కేసు మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పార్లమెంట్ లోపలా, బయటా నీట్ ప్రశ్నపత్రాల లీక్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి టైంలో సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలవడం ఆసక్తిని రేపుతోంది. అసలు ఈ భేటీలో ఏమేం జరిగింది? చంద్రబాబు మోదీతో కలిసి ఏదైనా ప్రకటన చేస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కుతూహల పెడుతున్నాయి.

NEET Paper Leak: Will Modi Ask Chandrababu?

చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలోని పార్లమెంట్‌లో కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా ఆగస్టు 1న జరగనున్న విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, మొమెంటో కూడా ఇచ్చారు. అయితే ఈ భేటీ సమయంలో ప్రస్తుతం దేశంలో నడుస్తున్న నీట్ పేపర్ లీక్ నిరసనల గురించి కూడా చర్చ జరిగినట్లు ఏపీ భవన్ వర్గాలు చెప్తున్నాయి.

ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నిరసనలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనలను విరమింప చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే ప్రధాని మోదీ చంద్రబాబు సహాయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్‌ కనిపిస్తోంది.

అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఒక పెద్ద యానౌన్స్‌మెంట్ ఉండబోతుందనే expectations క్రియేట్ అయ్యాయి. నీట్ పేపర్ లీక్ వివాదం పై చంద్రబాబు స్పందించి, కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తూ ప్రకటన చేస్తారా? లేదంటే వేరే ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచి చూడాలి. ఈ సమయంలో చంద్రబాబు పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.

Share your love