నాగచైతన్య, శోభిత జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 2024లో పెళ్లి చేసుకున్న ఈ కపుల్, ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తమ మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నాగచైతన్య తన వైఫ్ శోభిత ఫోటో షేర్ చేస్తూ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు, అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Nagachaitanya Sobhita cute banter
చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో శోభిత ఫోటో షేర్ చేస్తూ, పెళ్లయిన దాదాపు రెండేళ్ల తర్వాత మా ఆవిడ నా కోసం రాత్రికి భోజనం చేసింది. బహుశా ఈ రోజు నేను ఏదో మంచి పని చేసి ఉంటాను అని ఫన్నీగా పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో శోభిత రెండు చేతుల్లో ఫుడ్ పట్టుకుని నిల్చొని ఉంది. ఈ పోస్ట్ వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
అయితే ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ఏమిటీ, శోభితకు వంట రాదా? అని ఒకరు అడిగితే, రెండేళ్ల తర్వాత మొదటిసారి నీ కోసం ఫుడ్ వండిందా? అని మరొకరు ఫన్ చేశారు. నాగచైతన్య శోభిత ఫోటో షేర్ చేసిన ఈ పోస్ట్ చుట్టూ చాలా డిస్కషన్ నడుస్తోంది, కొందరు దీన్ని కేవలం హాస్యంగా తీసుకుంటుండగా, మరికొందరు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి chayakkineni (@chayakkineni) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్. నాగచైతన్య, శోభిత ఇద్దరూ తమ సినీ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. వీరి ఈ క్యూట్ బ్యాంటర్ నెటిజన్లకు కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది.





