Nara Rohith: ‘కపాలి’తో నారా రోహిత్ కొత్త అడుగు.. తొలి సారి హారర్ జోనర్!!

నారా రోహిత్ ఇప్పుడు హారర్ జానర్ లో అడుగు పెట్టబోతున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘కపాలి’తో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నేడు నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

Nara Rohith Kapali horror debut

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన నారా రోహిత్ కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ‘ప్రతినిధి 2’, ‘భైరవం’, ‘సుందరకాండ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే తండ్రి అయిన నారా రోహిత్, ఇప్పుడు కొత్త జోనర్ లో ట్రై చేయబోతున్నారు. ఈసారి హారర్ సినిమా చేయడం తన కెరీర్ లో ఫస్ట్ టైమ్.

రామ్ గన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ‘కపాలి’. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా పోస్టర్ లో హారర్ టచ్ క్లియర్ గా కనిపిస్తుంది. నారా రోహిత్ ఫ్యాన్స్ కి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. మార్కెట్ లో కూడా ఈ అనౌన్స్ మెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

కపాలి సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. నారా రోహిత్ ఈ సినిమాతో తన కెరీర్ లో కొత్త మార్క్ వేయాలని చూస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ హారర్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

Share your love