నారా రోహిత్ నటిస్తున్న కొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు Ka Pa Li అని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్యాగ్లైన్ ‘అజ్ఞాతం వైపు ప్రయాణం’. ఈ మూవీలో హన్సిక మోత్వాని హీరోయిన్గా నటిస్తోంది. రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథినా, భానుకిరణ్ ప్రతాప ప్రొడ్యూస్ చేస్తున్నారు. శనివారం నారా రోహిత్ బర్త్డే సందర్భంగా శుక్రవారమే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి టైటిల్ని అనౌన్స్ చేశారు.
Showcasing Ka Pa Li in a Haunting Poster
పోస్టర్లో నారా రోహిత్ ఇంటెన్స్ ఎమోషన్స్తో కనిపిస్తున్నాడు. అతను కనిపించని ఓ powerతో ఫైట్ చేస్తున్నట్టు ఆ పోస్టర్ కనెక్షన్ ఇస్తోంది. అతని తలపై కిరీటంలా కనిపిస్తున్న వంకర చెట్టు కొమ్మలు కథలోని మిస్టికల్ కనెక్షన్ని సూచిస్తున్నాయి. ప్రాచీన చిహ్నాలతో కూడిన డిజైన్, క్షుద్రశక్తులు, పురాణ నేపథ్యాన్ని రివీల్ చేస్తుంది. పోస్టర్లో ఎర్రటి కళ్ళతో కనిపిస్తున్న భయానక స్త్రీ రూపం అతీంద్రియ శక్తిని సూచిస్తుంది.
పోలీసులకు అతీంద్రియ శక్తులకు మధ్య సాగే పోరాటమే ఈ సినిమా స్టోరీలైన్ అని పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తుండగా, సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఫ్యాన్స్ కి ఇది ఓ కొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అందుకే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





