NEET Controversy: నీట్ వివాదంపై మాధవన్.. విద్యార్థుల పోరాటానికి మద్దతు!!

NEET వివాదంపై చివరికి FTII చైర్మన్, ప్రముఖ నటుడు R. మాధవన్ తన మౌనాన్ని వీడి స్పందించారు. పూణే క్యాంపస్‌లో విద్యార్థులు నిరసనలు చేపట్టడం, ఆయన ఆఫీస్‌కు బయట ‘NEET for Sale’ వంటి పోస్టర్లు ఏర్పాటు చేయడంతో ఈ స్పందన వచ్చింది. సోషల్ మీడియా ద్వారా మాధవన్ విద్యార్థుల పోరాటానికి సపోర్ట్ ఇస్తూ కీలక సూచనలు చేశారు.

The NEET Controversy Support

తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో మాధవన్ దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆందోళనను తాను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు చెప్పారు. విద్యా వ్యవస్థ నమ్మకాన్ని పెంచాలి కానీ పేపర్ లీక్ వంటి ఘటనలు కష్టపడి చదివే వారి భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని వివరించారు. ప్రభుత్వం వెంటనే నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేయడం శ్లాఘించదగిన విషయం అని మాధవన్ అభినందించారు. అయితే కొందరు ఈ ఉద్యమాన్ని రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం యూజ్ చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యార్థలు అప్రమత్తంగా ఉండాలి, తమ అసలు లక్ష్యాన్ని మరిచిపోకూడదని స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మాధవన్ ముందుగా స్పందించలేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఆఫీస్ ముందు ‘గాయబ్’ పోస్టర్లతో నిరసనలు చేపట్టారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మాధవన్‌పై స్పందనకు ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా, మాధవన్ వ్యాఖ్యలు ఈ చర్చలో ముఖ్యమైన స్పందనగా నిలిచాయి.

Share your love