
Vijay: విజయ్ చేసిన ఒక చిన్న తప్పు 40 మంది ప్రాణాలను బలిగొన్నది. ఆయన తన అభిమానులందరినీ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని తన ప్రసంగాలతో అదరగొట్టేయాలని చూశారు.కానీ చివరికి ఈ విషాదం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.ఇప్పటికే దాదాపు 40 మంది చనిపోగా.. 50 కి పైగా మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో విజయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీ రాజకీయ ప్రచారం ఏమో గాని 40 మందిని పొట్టన పెట్టుకున్నావు అంటూ చాలామంది ఫైర్ అవుతున్నారు.
Netizens Fire on Vijay
అంతే కాదు కొంతమంది అయితే విజయ్ ని వెంటనే జైల్లో తోసేయాలి.. ఇంతమంది ప్రాణాలు తీసుకున్న వాడు సీఎం అభ్యర్థి ఏంటి అంటూ మండిపడుతున్నారు. అయితే విజయ్ చేసిన ఒకే ఒక్క పొరపాటు ఇంతమంది ప్రాణాలను బలిగొన్నది.ఇక విజయ్ ఎంత పెద్ద సెలబ్రిటీనో మనకు తెలిసిందే. ఆయన సౌత్ ఇండస్ట్రీవ్యాప్తంగా పేరున్న హీరో. ఇక తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో మరింత ఫేమస్ కాబట్టి ఆయనకు ఎంత మంది అభిమానులు ఉంటారో తెలిసిందే.(Vijay)
Also Read: Naga Babu: మీ అయ్యకు చంద్రబాబు వెన్నుపోటు.. నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు?
అలాంటిది రాజకీయ నాయకులు వస్తేనే కుప్పలు కుప్పలుగా మంది గుమిగూడుతారు.అలాంటిది ఒక సినీ సెలబ్రిటీ బయటికి వస్తే అది కూడా తమిళనాడులో ఫేమస్ హీరో రోడ్డు మీదకి వస్తున్నాడు అంటే ఆయన్ని చూడడానికి లక్షలాది మంది వస్తారు అనేది ఊహించవచ్చు. అలాంటిది కేవలం 10,000 మంది మాత్రమే వస్తారని పోలీసుల అనుమతి తీసుకోవడం ..

అలాగే తక్కువ స్థలంలో ప్రసంగాం చేయడంతో తక్కువ స్థలంలో రెండు లక్షల మంది గుమిగూడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.అలా చిన్న ప్లేస్ లో ఈయన తన బహిరంగ ర్యాలీ కొనసాగించి పెద్ద తప్పు చేశారు. తనకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పెద్ద స్థలం ఉన్న దగ్గర ఈ ర్యాలీ పెట్టుకుంటే బాగుండేది అని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కానీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం 40 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది అంటూ ఫైర్ అవుతున్నారు.(Vijay)





