
నిఖిల్ సిద్ధార్థ అంటే టాలీవుడ్‌లో డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకునే హీరో అని పేరు. అలాంటి హీరో చేస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ స్వయంభు గురించి గత కొన్ని నెలలుగా ఎలాంటి వార్తా లేదు. సినిమా షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు కంప్లీట్ అయిందని టాక్ వచ్చినా, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం మేకర్స్ పూర్తి సైలెంట్‌గా ఉండిపోయారు. ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కానీ అప్‌డేట్ మాత్రం రావడం లేదు.
Nikhil Siddhartha Swayambhu Release Mystery
ఈ సైలెంట్ గేమ్‌పై ఆడియన్స్‌లో చాలా మంది కోపంగా ఉన్నారు. ఎందుకంటే స్వయంభు లాంటి హై బడ్జెట్ సినిమాకి ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. కానీ టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ అంటూ ఏ ఒక్కటి రిలీజ్ చేయలేదు. మొదట్లో ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ అంటూ మరో డేట్ వినిపించింది. కానీ అవన్నీ దాటిపోయాయి. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అన్ని చోట్ల ఫ్యాన్స్ ట్రెండింగ్ చేసి అడుగుతున్నారు కానీ ప్రొడ్యూసర్స్ నుంచి క్లారిటీ రావడం లేదు.
మరోవైపు నిఖిల్ సైతం రిలీజ్ డేట్ గురించి పెద్దగా మాట్లాడటం లేదు. దీంతో అసలు ఏదో ప్రాబ్లమ్ ఉందా? లేక బిజినెస్ లెక్కలు సరిగ్గా కుదరడం లేదా? అనే అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ వంటి టెక్నీషియన్స్‌కు కూడా పూర్తి పేమెంట్స్ అవ్వలేదని టాక్. ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే, అది సినిమా రిలీజ్‌ను లేట్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నిఖిల్ ఫ్యాన్స్ అంతా స్వయంభు రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ రోజూ ట్వీట్లు చేస్తున్నారు. కొందరు డైరెక్ట్‌గా నిర్మాతలను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా మేకర్స్ స్పందించి గుడ్ న్యూస్ చెబుతారా? లేదా మరింత లేట్ చేస్తారా? అన్నది చూడాలి. కానీ ఇలా ఎక్కువ కాలం సైలెంట్‌గా ఉంటే ఆడియన్స్‌లో హైప్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది, అది మాత్రం సినిమాకి మైనస్ అని చెప్పాలి.







