నితిన్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు అంతగా ఆడడం లేదు. వరుసగా ప్లాప్ అవుతుండడంతో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇక తన కొత్త సినిమాల మీదే ఈ హీరో ఆశలు పెట్టుకున్నాడు. బలగం వేణుతో ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు నితిన్, విక్రమ్ కె కుమార్ తో మరో సినిమా ఒప్పుకున్నాడు. అయితే నితిన్ తర్వాత చేయబోయే సినిమా విక్రమ్ కె కుమార్ తోనే అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇష్క్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీని పై మంచి అంచనాలు ఉంటాయి. ఇది స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుందని..ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ మూవీని నితిన్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని టాక్. ఈ సినిమాలో నితిన్ కు జంటగా పూజా హేగ్డే నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. నితిన్ లాగే పూజా హెగ్డేకు కూడా సరైన సక్సెస్ లేదు. విక్రమ్ కె కుమార్ సినిమాతో అయినా నితిన్ తో పాటు పూజాకు హిట్ పడాల్సిన అవసరం ఉంది.





