సెప్టెంబర్ 24కి ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘జడల్’ లుక், ‘ఆయా షేర్’ సాంగ్, టీజర్లలో కనిపిస్తున్న సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమా కావడం కూడా ఈ ఎక్సైట్‌మెంట్‌కు కారణం.
The Paradise Release New Update
అయితే, ఈ సినిమా రిలీజ్ విషయంలో జరుగుతున్న డిలే ప్రేక్షకుల్లో కూడా చర్చకు దారితీసింది. మొదట ఈ ఏడాది మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. తర్వాత ఆగస్ట్ 21కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీ కూడా మారినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తి కాకపోవడం, ప్రమోషన్‌కు సమయం సరిపోకపోవడం వంటి కారణాలతో దీన్ని సెప్టెంబర్ 24కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
కంపెనీ నుంచి అధికారిక అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాలో కయాదు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ యాక్టర్ మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేశ్‌బాబు, ఈశ్వరీరావు ఇతర క్యారెక్టర్లు పోషిస్తున్నారు.
అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ పాన్ ఇండియా మూవీని సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.





