నాని ఫ్యాన్స్‌కు ఇప్పుడు పెద్ద హ్యాపీ న్యూస్ వచ్చింది. ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
Paradise shooting in final stage
మొన్నటి దాకా రిలీజ్ డేట్ ప్రకటించినా, ఆ తర్వాత టీం మౌనంగా షూటింగ్ మీదే ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం క్లైమాక్స్ సీన్‌ను భారీ సెట్టింగ్‌లో శ్రీకాంత్ ఓదెల షూట్ చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఒక ఐటమ్ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉంది. ఈ రెండు పూర్తయితే మాత్రమే అసలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.
ఈ మూవీలో కయాదు హీరోయిన్ గా నటిస్తుండగా, డా.మోహన్ బాబు చాలా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కాస్త టెన్షన్ గా ఉన్నా, ఇప్పుడు షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉండటం చాలా గుడ్ న్యూస్. క్లైమాక్స్, ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ డేట్ కూడా వెంటనే వచ్చేస్తుంది. నాని ఫ్యాన్స్ కోసం ఈ అప్‌డేట్ చాలా ఆనందంగా ఉంది.





