Pawan Kalyan: మళ్లీ కేబినెట్ సమావేశానికి గైర్హాజరు

పవన్ కళ్యాణ్ మళ్ళీ కేబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు లీడ్ చేసిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం పాల్గొనకపోవడం మామూలు విషయం కాదు. స్టేట్ డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్ వంటి కీలక అజెండాల మీద డిస్కషన్ జరుగుతుండగా ఆయన లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Pawan Kalyan Cabinet Meeting Absence

పవన్ ప్రస్తుతం మంగళగిరిలోని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. జనసేన సోర్సెస్ ప్రకారం, అనారోగ్యం కారణంగా డాక్టర్లు సలహా ఇవ్వడంతో ఆయన కాస్త బ్రేక్ తీసుకున్నారు. అందుకే సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. రెండు రోజుల కిందట తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన విషయం ఇప్పటికే అందరికీ తెలుసు.

టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబంలో ఓ విషాదం జరిగింది. ఆ సమయంలో పవన్ ఆసుపత్రికి వెళ్లి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ను కలిసి ఓదార్చారు. అప్పటి నుంచి ఆయన మంగళగిరిలోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎలాగైనా డిప్యూటీ సీఎం త్వరలోనే పూర్తి రికవరీ అయి తన ఆఫీషియల్ వర్క్, రివ్యూలు, టూర్లు మళ్లీ స్టార్ట్ చేస్తారని సమాచారం. (Source: Adya News Telugu)

Share your love