Plastic Notes: భారత్ లో ప్లాస్టిక్ నోట్ల చలామణి..పాలిమర్ నోట్ల జారీ కేంద్రం ఆమోదం!!

Government decision on plastic currency notes

త్వరలో భారతదేశంలో ప్లాస్టిక్ నోట్ల చలామణి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రయోగం కింద రూ.10 మరియు రూ.20 డినామినేషన్లలో 10 కోట్ల పాలిమర్ కరెన్సీ నోట్లను జారీ చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇది దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశానికి తొలి అడుగు. ప్రయోగం విజయవంతమైతే, తర్వాత భారీ ఎత్తున నోట్ల ముద్రణ జరుగుతుందని అంచనా.

Plastic Notes India Launch Plan

పాలిమర్ నోట్లు చాలా బలంగా ఉంటాయని, ఎక్కువ కాలం మన్నుతాయని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. ఇవి కాగితపు నోట్లలా సులువుగా చిరిగిపోవు. నీరు, మురికి వల్ల డ్యామేజ్ కూడా తక్కువ. ప్రపంచంలో ఇప్పటికే 50 కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. అయితే, కాగితపు కరెన్సీని పూర్తిగా నిలిపివేసే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. రెండు రకాల కరెన్సీలు కలిసి సర్క్యులేషన్లో ఉంటాయి. ప్రజలు తమ దగ్గర ఉన్న కాగితపు నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు.

ఇది ఆర్బీఐకి తొలిసారి కాదు. గతంలో 2009 సెప్టెంబర్లో కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ వంటి నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రయత్నించింది. కానీ సాంకేతిక లోపాల వల్ల ఆ ప్రయోగం సక్సెస్ కాలేదు. ఈసారి అత్యాధునిక టెక్నాలజీతో, గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి ముందుకు వెళ్తున్నారు. సామాన్య ప్రజల రోజువారీ వ్యవహారాల్లో చిన్న డినామినేషన్లు ఎక్కువగా నలిగిపోతుంటాయి. వాటిని ఎక్కువ కాలం మన్నేలా, సురక్షితంగా ఉంచడమే ఈ ప్లాస్టిక్ నోట్ల ప్రయోగం లక్ష్యం.

ప్రస్తుతం UPI, డిజిటల్ పేమెంట్స్ పెరిగినప్పటికీ, నగదు వినియోగం పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న డినామినేషన్ల డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ నోట్ల వల్ల లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి నోట్ల ముద్రణ ఖర్చు కూడా తగ్గుతుంది. కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోవడం వల్ల తరచుగా కొత్తవి ముద్రించాల్సి వస్తుంది. ఈ న్యూ ప్లాన్ ప్రకారం, 2026 నాటికి పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నోట్ల వినియోగం ప్రారంభం కావొచ్చని అంచనా.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu