

Telangana: తెలంగాణలో 7 నెలలుగా పాస్ బుక్కుల ముద్రణ నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రింటింగ్ ప్రెస్కు బకాయిలు చెల్లించలేదట రెవెన్యూ శాఖ. దీంతో 7 నెలలుగా ఈ పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పూర్తయిన తర్వాత కూడా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదట. Telangana
Telangana Printing of passbooks stalled in Telangana for 7 months
గతేడాది జులై నుండి పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది. సెప్టెంబర్ నెల నుంచి పూర్తిస్థాయిలో కొత్త పాస్ పుస్తకాల జారీ నిలిచిపోయినట్లు చెబుతున్నారు. అయితే, ఈ పాస్ పుస్తకాలను ఇప్పటివరకు ముద్రిస్తున్న మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్కు రూ.2.4 కోట్ల బకాయిలు చెల్లించలేదట రెవెన్యూ శాఖ. Telangana
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?
దీంతో పాస్ పుస్తకాల ముద్రణ నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1.06 లక్షల పాస్ పుస్తకాలు ముద్రించకుండా నిలిచిపోయాయని సమాచారం అందుతోంది. దీనిపై రైతులు, బీఆర్ ఎస్ పార్టీ సీరియస్ అవుతోంది. Telangana
Also Read: MLA Arava Sridhar: మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్న జనసేన ఎమ్మెల్యే..మరో వీడియో.







