congress and kcr BRS

KCR: కేసీఆర్ రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన చంద్రబాబు తర్వాత రెండో స్థానంలో పేరున్న నాయకుడిగా మారారు. కానీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ ని మించిన రాజకీయ నాయకుడు లేరు అంటారు. ఎందుకంటే కేసీఆర్ సమాజానికి తగ్గట్టు అప్డేట్ అవుతూ వస్తున్నారు.

అలా ఇప్పటికే రెండు పర్యాయాలు తెలంగాణలో గెలిచిన ఈయన మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తూ అభ్యర్థులను ప్రకటించి టికెట్ రాని నాయకులను వేరే పదవి ఇస్తామని బుజ్జగిస్తూ ఇతర పార్టీలలోకి వెళ్లకుండా తమ పార్టీ నేతలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక ఎన్ని విధాలుగా కేసీఆర్ తమ పార్టీని కాపాడుకున్న కూడా ఎక్కడో ఒకచోట తప్పు జరిగి ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు నాయకులు. ఇదిలా ఉంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ తో పోటీ అంటే భయపడి వెనకడుగు వేస్తున్నారట. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కేసీఆర్ గజ్వేల్ మరియు కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు. ఇక గజ్వేల్ లో ఈటెల రాజేందర్ కేసీఆర్ కి పోటీగా దిగుతున్నప్పటికీ కామారెడ్డిలో కెసిఆర్ కి పోటీగా కాంగ్రెస్ నుండి షబ్బీర్ అలీ ఉంటున్నట్లు వార్తలు వినిపించాయి.

Also Read: Revanth Reddy : కొడంగల్ బీజేపీ అభ్యర్థిగా చీకోటి ప్రవీణ్…రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమేనా ?

అయితే షబ్బీర్ అలీ పేరు మాత్రం కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో కనిపించలేదు.దానికి ప్రధాన కరణం షబ్బీర్ అలి నే కెసిఆర్ కి భయపడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు మమ్మల్ని పడగొట్టే వారు ఎవరూ లేరు కచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అని అనుకున్న కాంగ్రెస్ నాయకులకి కామారెడ్డి లో కెసిఆర్ ద్వారా చెక్ పడబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ మీద పోటీ చేసి ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది అని షబ్బీర్ అలీ భయపడుతున్నారట. ఈ కారణంతోనే ఫస్ట్ లిస్టులో ఆయన పేరు రాలేదని తెలుస్తోంది.(KCR)

అయితే కామారెడ్డి నుండి పోటీ చేస్తే ఓడిపోతాను అనే భయంతో ఎల్లారెడ్డి నుండి పోటీ చేయాలి అని షబ్బీర్ అలీ నిర్ణయించుకున్నారట..కానీ అక్కడే కీలక నేతగా ఉన్న మధుసూదన్ రావుని షబ్బీర్ అలీ భుజగించే పనిలో పడ్డారట. అయితే మధుసూదన్ ఒప్పుకుంటే ఎల్లారెడ్డి లేకపోతే తప్పని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేయాలి అని, ఒకవేళ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా కామారెడ్డి నుండి తప్పుకొని మరో నియోజకవర్గంలో పోటీ చేయాలి అని షబ్బీర్ అలీ భావిస్తున్నారట. ఇక ప్రస్తుతం ఈ విషయం ఆ నోట ఈ నోట బయటపడడంతో కెసిఆర్ కు భయపడే షబ్బీర్ అలీ వెనకడుగు వేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి షబ్బీర్ అలీ కామారెడ్డి నుండి పోటీ చేస్తారా లేక వేరే నియోజకవర్గానికి మారతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.(KCR)

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp