BJP Party Telangana Election Strategy Telangana Elections: BJP's Calculated Moves

BJP Party Telangana Election Strategy

BJP: తెలంగాణ రాష్ట్రం మొత్తం బిఆర్ఎస్ కాంగ్రెస్ ల మేనిఫెస్టోలు,అభ్యర్థుల గొడవ ఇదే రాజకీయాల్లో చర్చినీయాంశంగా మారింది. కానీ అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు ఎన్నికల విషయంలో మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం చాలా సైలెంట్ గా ఉంది. ఇప్పటికే ఇటు బిఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు పార్టీ లు అభ్యర్థులను ప్రకటిస్తూ బీఫామ్ లు ఇచ్చే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు.

కానీ ఇప్పటివరకు బిజెపి అభ్యర్థుల లిస్టుని బయట పెట్టడం లేదు.అయితే ఇప్పటికే బీజేపీకి తెలంగాణ లో క్యాడర్ లేదని, చాలా నియోజకవర్గాల్లో అసలు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కేవలం తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి నాయకులకు తప్ప మిగతా ఎవరికి కూడా అంతగా రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు లేవు. ఇక తెలంగాణ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ లు ఎన్నికల మేనిఫెస్టోలను సైతం విడుదల చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఎన్నికల ప్రచారంలో మునిగిపోతూ ఉంటే బిజెపి మాత్రం ఇంకా అభ్యర్థులను కూడా ప్రకటించడంలో వెనుకబడింది.

Also Read: KCR: కేసీఆర్ తో పోటీ అంటే భయపడిపోతున్న కాంగ్రెస్ నాయకులు..కారణం..?

ఇక మేనిఫెస్టో ఎప్పుడు తయారు చేస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటికే ఇటు బిఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఇద్దరూ రైతులకు, యువతకు, మహిళలకు, వృద్ధులకు, ఉద్యోగులకు తమ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే పథకాలను ప్రవేశపెట్టారు. ఇక బిజెపి సైతం తమ మేనిఫెస్టోను బయట పెట్టబోతున్నట్లు మాత్రమే వినిపించినప్పటికీ అందులో చాలా వరకు బిఆర్ఎస్,కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన పథకాలే ఉంటాయని తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా చాలామంది ఆడవాళ్ళపై,చిన్న పిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోవడంతో బిజెపి పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని, కేవలం మతం పేరు చెప్పుకొని మాత్రమే ఓట్లు అడుగుతున్నారని, భారతదేశం అంటే మతం కాదు భారతదేశం అంటేనే ఐక్యమత్యమైన దేశంగా పేరు తెచ్చుకుంది.అలాంటి ఈ దేశంలో మతం విషయంలో ప్రకంపనలు సృష్టించి అందర్నీ మత విద్వేషాలతో రెచ్చగొడుతూ అల్లర్లు చేస్తున్నారని ఇప్పటికే బీజేపీపై ఒక మచ్చ పడింది.అలాగే వీరు ప్రకటించే మేనిఫెస్టోలో చాలావరకు ఉచితాలు ఉండవు.

ఎందుకంటే ఇప్పటికే మేము ఉచితలకు వ్యతిరేకం అని బిజెపి పార్టీ చెప్పుకుంటూ వస్తారు. అయితే ఇప్పటికే చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉండి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అందులో సక్సెస్ కాలేదు.ఇక తెలంగాణలో పథకాలు ప్రవేశపెట్టినా సక్సెస్ చేస్తారనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో లేదు. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బిఆర్ఎస్ ల ముందు తగ్గి బిజెపి వెనకడుగు వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అంతేకాదు ఎన్నికల బరి నుండి పరోక్షంగా తప్పకుంటున్నట్లు బిజెపి నాయకుల నుండి సిగ్నల్స్ వస్తున్నాయని,తమ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో అధికారంలోకి రాదని స్పష్టం అయిందని,అందుకే ఈ ఎన్నికల్లో బిజెపి హడావిడి అంతగా కనిపించడం లేదని తెలుస్తోంది.(BJP)

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp