tdp varma Given Big Shock To pawan kalyan

Pawan Kalyan: పిఠాపురం నియోజక వర్గంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కట్టప్ప గా మారిపోయాడు టిడిపి నేత వర్మ. అదేంటి జనసేనకు సపోర్ట్ గా నిలుస్తూ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ప్రచారం చేస్తున్నాడు కదా అని అనుకుంటున్నారా ? ఇదంతా పైపై మాటే. పైన పటారం లోన లోటారం లాగానే టిడిపి మరియు జనసేన పొత్తు కొనసాగుతూ ఉందని తెలుస్తోంది. Pawan Kalyan

tdp varma Given Big Shock To pawan kalyan

ఎక్కడ చూసినా అసంతృప్త వర్గాలు తెరపైకి వస్తున్నాయి. జనసేన అభ్యర్థి ఉన్నచోట టిడిపి కార్యకర్తలు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. అటు టిడిపి నేతలు బరిలో ఉన్న స్థానాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేనను ఓడిం చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలే కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. Pawan Kalyan

Also Read: Mahasena Rajesh: పవన్ కళ్యాణ్ కు విలన్ గా మారిన మహాసేన రాజేష్ ?

తాజాగా తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్చార్జి వర్మ తన సన్నిహితులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కార్యకర్తలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఓటు వేయకూడదని ఆయన మాట్లాడారు. దీంతో వర్మ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Pawan Kalyan

ఈ ఆడియో మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ గెలుపు కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం మరియు జనసేన కేడర్ విడిపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కష్టమని చెబుతున్నారు. అయితే వర్మ అలా మాట్లాడింది కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వైసీపీపై జనసేన మరియు టిడిపి ఆరోపణలు చేస్తోంది. ఏదేమైనా తాజాగా వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు పిఠాపురం నియోజకవర్గంలో హల్చల్ గా మారాయి. ఓటర్ నాడీ పూర్తిగా మారిపోయేలా చేశాయి. Pawan Kalyan

Join WhatsApp