డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు అయిన షూటింగ్ రషెష్ చేసుకున్న పూరి చాలా సంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఈసారి సూపర్ హిట్ కొడుతున్నామని తన ఫ్రెండ్స్ కు చెబుతున్నాడట పూరి జగన్నాథ్. ఈ మూవీకి బెగ్గర్, భవతీ భిక్షాందేహీ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట. ఇందులో సీనియర్ నటి టబు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తోంది
పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం రెండు కథలను లాక్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఒక సినిమాలో తమిళ స్టార్ హీరోలు సూర్య లేదా శివ కార్తికేయన్ ఎవరో ఒకరు నటించే ఛాన్స్ ఉందని సమాచారం. మరో కథ తెలుగులో ఓ యూత్ స్టార్ కి వినిపించబోతున్నారని తెలిసింది. విజయ్ సేతుపతి సినిమా సెట్స్ పై ఉండగానే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ మెటీరియలైజ్ అయితే పూరి కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి ఎక్కినట్లే.




