ఎంపీసీ రాదంటా, బైపీసీ భయమంటా..!

మౌళి తనుజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “లిటిల్ హార్ట్స్” మూవీ నుంచి ఈరోజు చదువూ లేదు, సంధ్యా లేదు లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సగటు తెలుగు స్టూడెంట్ లైఫ్ ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. చదువుల్లో ఏ టాలెంట్ లేని కుర్రాళ్లు, బయట ఎలాంటి ఘనకార్యాలు చేస్తుంటారు అనేది చదువూ లేదు పాటలో హైలైట్ గా నిలుస్తోంది. ఈ పాటను సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా, జెస్సీ గిఫ్ట్ పాడారు. ఎంపీసీ రాదంటా, బైపీసీ భయమంటా, చాతేమీ కాదంటా అయ్యో శుంఠా..అనేది హీరో చేసిన అఖిల్ క్యారెక్టర్ కు పక్కాగా సెట్ అవుతుంది.

“లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Share your love