
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత్‌లో తన స్టార్‌లింక్ అనుమతులకు జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని ఉద్దేశించి చేసిన ట్వీట్‌కు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ “మరో వ్యక్తి కూడా ఉన్నారు” అంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయంగా ఎంతో పేరుగాంచిన స్టార్‌లింక్ సంస్థ దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అనుమతులు రాకపోవడంపై ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో నిలదీశారు.
Rahul Gandhi Responds Musk Ambani
భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొంతమంది ఒలిగార్కులు తమ గుత్తాధిపత్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 165కిపైగా దేశాల్లో లైసెన్సులు పొందిందని, ఐదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వ అవసరాలు మరియు చట్టాలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అంబానీయే భారత్‌కు అసలైన బాసా అంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ మరింత వ్యంగ్యంగా స్పందిస్తూ ఆ మరో వ్యక్తి ఎవరో వేచి చూడాలని సూచించారు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది రాహుల్ గాంధీ స్పష్టంగా పేర్కొననప్పటికీ, ఆ వ్యాఖ్యలు గౌతమ్ అదానీని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ అంబానీ, అదానీలను ప్రధానంగా టార్గెట్ చేస్తూ అధికారంలో ఉన్న పార్టీతో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పలుమార్లు తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ఎలాన్ మస్క్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇది నిజంగా ఆందోళనకరమైన విషయమని రిప్లై ఇచ్చారు. మరోవైపు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల అనుమతుల వ్యవస్థ పూర్తిగా న్యాయమైందని, ఎలాంటి వివక్ష లేదని భారత్ స్పష్టం చేసింది. ఇప్పటికే స్టార్‌లింక్‌తో పాటు రిలయన్స్ జియో సాట్‌కామ్, భారతి మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు కూడా లైసెన్సులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి






