
Raja Mouli: ఎన్నో ఖతర్నాక్ సినిమాలు చేసిన ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ ఇటీవల చేశారు. రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఈవెంట్ నిర్వహించి, టైటిల్ అనౌన్స్ చేశారు రాజమౌళి. అయితే ఈ సందర్భంగా హనుమంతుడిని గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రాజమౌళి ట్రోలింగ్ గురయ్యారు. Raja Mouli
3 cases registered against director Rajamouli
తమ హనుమంతుడిని రాజమౌళి కించపరచాడని అటు బిజెపి నేతలు కూడా రెచ్చిపోతున్నారు. వరుసగా రాజమౌళి పై కేసులు పెడుతున్నారు. ఇక తాజాగా దర్శకుడు రాజమౌళి పై మూడు కేసులు నమోదయ్యాయి. వారణాసి టైటిల్ టీజర్స్ సందర్భంగా మహేష్ బాబు నందిపై కూర్చొని కనిపించడంతో, హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఓ కేసు నమోదయింది. హిందూ సంఘాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్ లో బాహుబలి అలాగే ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్లుగా చూపించాడని రాజమౌళి పై మరో కేసు కూడా నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. Raja Mouli
Also Read: Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?
ఇప్పటికే వారణాసి ఈవెంట్లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని రాజమౌళి పై సరూర్నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానర సేన సంఘం ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే వీళ్ళందరినీ నడిపించేది బిజెపి నేతలని సమాచారం అందుతుంది. అటు బిజెపి నేత మాధవి లత కూడా ఈ అంశంపై స్పందించారు. రాజమౌళికి కౌంటర్ ఇచ్చారు.బాహుబలి సినిమాలో ప్రభాస్తో శివలింగాన్ని ఎటించి కోట్లు సంపాదించారు, కానీ ఇప్పటివరకు ఏ శివుని గుడికైనా దానధర్మాలు చేశారా అని ఫైరయ్యారు. ఆరోజు చేసింది లేదు ఈరోజు హనుమంతుడిని తిట్టడం ఎందుకు సార్ అంటూ ఆమె మండిపడ్డారు. Raja Mouli
Also Read: Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మధ్య వార్ ?





Nagavamsi Comments: బాక్సాఫీస్ నంబర్లతో మోసం చేస్తున్నారా?