Vijayasai Reddy: TDP లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సలహాదారుడిగా పాత్ర?

Vijayasai Reddy chandrababu

Vijayasai Reddy: వైసీపీ పార్టీలో దాదాపు 14 సంవత్సరాలకు పైగా క్రియాశీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూ బయటికి వెళ్లిపోయారు. బయటకు వెళ్లడమే కాకుండా విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పారు. Vijayasai Reddy

Vijayasai Reddy joins TDP Chandrababu Naidu role as advisor

ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చిన విజయసాయిరెడ్డి ఆ మధ్యకాలంలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ ఆ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలోకి విజయసాయిరెడ్డి రాబోతున్నారట. అంతేకాదు పార్టీలో కీలక పాత్ర కూడా పోషించబోతున్నారట.Vijayasai Reddy

Also Read: Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మ‌ధ్య వార్ ?

నారా చంద్రబాబు నాయుడు సలహాదారుడి పాత్రలో విజయ్ సాయి రెడ్డి కి ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వార్త బయటకు రాగానే విజయ్ సాయి రెడ్డిని అలాగే తెలుగుదేశం పార్టీని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. జగన్కు సలహాదారుడిగా ఉండి వెన్నుపోటు పొడిచాడని, ఇప్పుడు చంద్రబాబుకు కూడా విజయ్ సాయి రెడ్డి వెన్నుపోటు పొడవడం గ్యారెంటీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కావాలని విజయసాయిరెడ్డిని ఆ పార్టీలోకి పంపుతున్నారని మరి కొంతమంది వాదిస్తున్నారు. Vijayasai Reddy

Also Read: Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్‌… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?

Leave a Comment