
ARC Cinemas: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా విశేష విజయాలను సాధిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో కొత్త రంగమైన మల్టీప్లెక్స్ (multiplex) బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు (AMB Cinemas), అల్లు అర్జున్ (AAA Cinemas), విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్ హీరోలను ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Ram Charan launches ARC Cinemas
తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ “ARC Cinemas” పేరుతో కొత్త మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఏషియన్ గ్రూప్ (Asian Group) సునీల్‌తో కలిసి నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలో (initial stage) ఉండగా, త్వరలో స్థలం, సౌకర్యాలు, నిర్మాణం వంటి అంశాలపై అధికారిక ప్రకటన (official announcement) వెలువడనుంది.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ARC Cinemas ఏర్పాటు చేయాలా, లేక హైదరాబాదులోనే మొదలుపెట్టాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, అల్లు అర్జున్ తరహాలో చరణ్ కూడా విశాఖపట్నం (Visakhapatnam) నగరాన్ని టార్గెట్ చేస్తున్నారని బలమైన టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇక సినిమాల విషయానికొస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, 2026 మార్చి 27న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొంతకాలం షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి.


