Ram Charan: రామ్ చరణ్ కి బిపి వస్తే చేసే పని.. నోట్లో నుండి ఆ పచ్చి బూతు పదం..!

What Ram Charan does when he gets BP

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి చిరంజీవి అండదండలు లేకుండానే సినిమాల్లో స్టార్ అయ్యారని చెప్పుకోవచ్చు. గ్లోబల్ రేంజ్ కి ఎదిగారు అంటే రామ్ చరణ్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈయన ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారడమే కాకుండా గ్లోబల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాగే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రాంచరణ్ మైనపు విగ్రహాన్ని కూడా పెట్టారు. అలా గ్లోబల్ రేంజ్ లో రామ్ చరణ్ పేరు మార్మోగిపోతుంది.

What Ram Charan does when he gets BP

ఒకరకంగా చెప్పుకోవాలంటే చిరంజీవికి కొడుకుగా రాంచరణ్ పుట్టడం ఎంత అదృష్టమో రామ్ చరణ్ కి తండ్రి చిరంజీవి అయినందుకు ఆయన కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతారట. అయితే అలాంటి రామ్ చరణ్ కి బీపీ వస్తే మొదటి చేసే పని అదేనట.మరి ఇంతకీ రాంచరణ్ కి కోపం వస్తే చేసే పని ఏంటో ఇప్పుడు చూద్దాం.మనిషి అన్నప్పుడు కచ్చితంగా కోపం వస్తుంది.. అయితే సెలబ్రిటీలకు కోపం వస్తే బయటికి ఎక్కువగా కనిపించనివ్వరు. సినిమాల్లో వాళ్ళ కోపం చూస్తాం కానీ లైవ్ లో వారి కోపాన్ని ఎక్కువగా బయటపడనివ్వరు. అయితే రామ్ చరణ్ కి మాత్రం బిపి పెరిగితే ఏం చేస్తారో ఆ మధ్యకాలంలో చెప్పారు.. (Ram Charan)

Also Read: Sreeleela: పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అలా కనిపించాలి – శ్రీలీల బోల్డ్ వ్యాఖ్యలు!!

ఇక రాంచరణ్ కి బీపీ వస్తే మొదట మైక్ పగలగొడతారట.అయితే ఏదైనా ఈవెంట్లో అలా బీపీ పెరిగిపోతే మైక్ పగిలిపోద్ది అని రామ్ చరణ్ స్వయంగా తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పక్కనుండి మాట్లాడుతూ మైక్ పగిలిపోవడమే కాదు నోట్లో నుండి ఓ పచ్చి బూతు పదం వస్తుంది అంటూ కామెడీ చేశారు.అయితే ఈ విషయాన్ని రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో బయటపెట్టారు. రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురు కలిసి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు సుమా చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు.

What Ram Charan does when he gets BP

అయితే అప్పటి వీడియో మళ్లీ ఇప్పుడు వైరల్ అవ్వడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ చరణ్ కి కోపం వస్తే నిజంగానే మైక్ పగలగొడతారా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇప్పటివరకైతే పబ్లిక్ ఈవెంట్లో చరణ్ కి మైక్ పగలగొట్టే అంత బిపి అయితే ఎక్కడా కూడా పెరగలేదు. మరి చరణ్ ఫన్నీగా అలా చెప్పారా లేక నిజంగానే కోపం వస్తే అంత పని చేస్తారా అనేది మాత్రం తెలియదు.(Ram Charan)

Share your love