సందీప్ రెడ్డి వంగా సమర్పణలో త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘రోమాంచకం’ అధికారిక గ్లింప్స్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్లతో దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి వంగా ఈసారి ప్రేక్షకులకు తాజా లవ్ స్టోరీని అందించనున్నారు.
భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మేమ్ ఫేమస్’ హీరో సుమంత్ ప్రభాస్, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే యూత్‌ను ఉర్రూతలూగిస్తోంది. తీరం బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ సీన్స్, బైక్ రైడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, క్లైమాక్స్‌లో వచ్చిన ట్విస్ట్ అందరినీ షాక్ చేసింది.
గ్లింప్స్ ముగింపులో హీరో హీరోయిన్లు ఒకరినొకరు గట్టిగా చెంపదెబ్బలు కొట్టుకుంటూ ‘ఐ హేట్ యూ’ అని అరవడం సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్‌కు సూచనగా నిలుస్తోంది. ప్రారంభంలో కూల్‌గా సాగిన వాతావరణం ఒక్కసారిగా ఇంటెన్స్ ఎమోషనల్‌గా మారడంతో ఈ ప్రేమకథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరింత ఆసక్తికరంగా మారాయి.
వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ రొమాంచకం సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘హేట్ టు లవ్’ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. మేకర్స్ త్వరలోనే సింగిల్స్, టీజర్ వంటి అప్డేట్లను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.





