
Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మొత్తం మారిపోయింది.పుష్ప సినిమా ముందు ఒక లెక్క పుష్ప సినిమా తర్వాత మరో లెక్క అయిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టేసింది.ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి పుష్ప -2 ని భారీ ఎత్తున నిర్మించారు.దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఇన్ని కోట్ల కలెక్షన్లు సాధించిన హీరో ఎవరు లేరు..
It doesnot matter if Bunny Opika gets an Oscar
అలాంటి ఘనత అల్లు అర్జున్ సాధించారు. అంతేకాదు పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు ని కూడా అందుకొని ఇప్పటివరకు తెలుగు హీరోలు ఎవరు అందుకొని ఆ అద్భుతమైన గౌరవాన్ని దక్కించుకున్నారు.అయితే అలాంటి అల్లు అర్జున్ పుష్ప-2 తరువాత ఎంతమంది డైరెక్టర్లతో సినిమాలు విన్నారో తెలిస్తే మీరంతా షాక్ అవ్వాల్సిందే.మరి ఇంతకీ అల్లు అర్జున్ ఎంతమంది దర్శకులు చెప్పిన కథలు విన్నారో తెలుసా తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.(Bunny)
Also Read: Uday kiran: సరిగ్గా చనిపోయే 6 రోజుల ముందు పవన్ కళ్యాణ్ పై ఉదయ్ కిరణ్ కామెంట్స్.. డైరెక్టర్…
ఇక ఆ డైరెక్టర్లు ఎవరంటే..తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగా, సురేందర్ రెడ్డి లు చెప్పిన కథలు వినడంతో పాటు తమిళంలో లోకేష్ కనగరాజ్, అట్లీ,కన్నడలో ప్రశాంత్ నీల్ బాలీవుడ్ నుండి సంజయ్ లీల భన్సాలీ మలయాళం లో బాసిల్ జోసెఫ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుండి దర్శకులు వచ్చి అల్లు అర్జున్ కి కథలు చెప్పారట.అలా ఫైనల్ గా పుష్ప-2 తర్వాత అట్లీతో సినిమాకి ఓకే చేశారు. ఈ సినిమా తర్వాత ఈ డైరెక్టర్ లందరూ లిస్టులో ఉన్నారట.

ఇక వీరందరూ చెప్పిన కథలు చేయాలంటే అల్లు అర్జున్ మరో 10 సంవత్సరాల వరకు బిజీ అని చెప్పుకోవచ్చు.మరి ఈ దర్శకులందరూ చెప్పిన కథలు అల్లు అర్జున్ కి నచ్చాయా.. అందులో కొంతమందిని ఓకే చేస్తారా లేక అందరితో సినిమాలు చేస్తారా అనేది ముందు ముందు తెలియాలి.ఇక ఈ విషయం వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు అల్లు అర్జున్ అంత మంది దర్శకులు చెప్పిన కథలు విన్నారంటే నిజంగా ఆయనకి ఆస్కార్ ఇచ్చినా పర్వాలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Bunny)




















