
Rukmini Vasanth: రుక్మిణి వసంత్..ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. ఒకప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు ఎలా అయితే వైరల్ అయిందో ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 మూవీ తో రుక్మిణి వసంత్ పేరు కూడా అదే లెవెల్ లో వైరల్ అవుతుంది. అంతేకాదు కొంతమంది అయితే రష్మిక మందన్నాని పక్కనపెట్టి నేషనల్ క్రష్ అంటే రష్మిక కాదు ఇప్పటినుండి రుక్మిణి వసంతే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Rukmini Vasanth becomes the daughter-in-law of that star hero house
అలా ఎంతోమంది అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన రుక్మిణి వసంత్ కి సంబంధించి తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే..రుక్మిణి వసంత్ సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వని ఓ హీరో కొడుకుతో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రుక్మిణి వసంత్ కి ఆ హీరో కొడుకుతో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమ వరకు దారి తీసినట్టు సమాచారం.(Rukmini Vasanth)
Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ వల్ల రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. ఇంకో సంవత్సరమే ఉంటానంటూ.?
అందుకే ఆ హీరో కొడుకు రీసెంట్గా కాంతార చాప్టర్ 1 విడుదలైన సమయంలో సినిమా తో ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా పోస్టులు పెట్టి పరోక్షంగా రుక్మిణి వసంత్ తో ఉన్న ప్రేమని అందరికీ తెలిసేలా చేశారని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అన్ని కుదిరితే రుక్మిణి వసంత్ ఆ హీరో కొడుకుని పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు.

అయితే రుక్మిణి వసంత్ ప్రేమలో పడింది అనే వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తాజాగా ఈ వార్త మాత్రం కన్నడ ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది.మరి ఇంతకీ ఈ ప్రేమ వార్తలపై రుక్మిణి వసంత్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. మరి రుక్మిణి వసంత్ మనసు దోచిన ఆ హీరో కొడుకు ఎవరో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.(Rukmini Vasanth)




















