
Telangana Congress: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం తలెత్తుతోంది. మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్ వర్సెస్ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్ మధ్య దున్నపోతు గొడవ జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ గొడవలో ఇన్వాల్వ్ చేసిన కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. పంపకాల్లో తేడాలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మంత్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది. Telangana Congress
Telangana Congress Komatireddy Rajagopal Reddy Vs Jupally Krishna Rao
అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మరో వివాదం తెరపైకి వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య గొడవలు జరుగుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు పెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని… పర్మిట్ రూమ్లో ఉండకూడదని రాజగోపాల్ రెడ్డి కండిషన్స్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో టెండర్లు వేయడానికి భయపడి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు మద్యం వ్యాపారస్తులు వెళ్తున్నారు. Telangana Congress
Also Read: Sugar: తియ్యగా ఉందని, చక్కెర ఎక్కువగా తింటున్నారా..అయితే 100 రోగాలు ఎటాక్ ?
ఈ విషయంపై స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రమంతా ఒకే రూల్ ఉంటుంది.. ఒక్కో నియోజకవర్గానికి ఒక్క రూల్ ఉండదు.. అందరూ ఫాలో కావాల్సింది అంటూ జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెడుతున్న మద్యం షాపుల కండిషన్స్ మంత్రి జూపల్లి రిజెక్ట్ చేశారు. ఆయన మాట పట్టించుకోకూడదని పరోక్షంగా చెప్పేశారు. అయితే దీనిపై రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రభుత్వం అధిష్టానానికి పూర్తిగా నివేదిక పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. Telangana Congress
Also Read: Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్





