Kantara Chapter 1: రిషబ్ శెట్టి కాంతార చాఫ్టర్ 1 మరో అరుదైన రికార్డు

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. Kantara Chapter 1 రిలీజ్ అయ్యి ఏడాది గడిచినా ఇంకా కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది, ఇప్పుడు తాజాగా ఒక అరుదైన డిజిటల్ మైల్‌స్టోన్ కొట్టడంతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. రిషబ్ శెట్టి సొంతంగా తెరకెక్కించిన ఈ ప్రీక్వెల్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఏ రేంజ్‌లో ట్రెండ్ సెట్ చేసిందో అందరికీ తెలుసు.

Kantara Chapter 1 Musical Feat

సినిమా బిజినెస్‌ ఎలా ఉన్నా, దాని మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్‌లో క్రేజ్‌ క్రియేట్ చేసింది. ముఖ్యంగా బి. అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేసిన బ్రహ్మలక్ష సాంగ్‌ ఇన్స్టాగ్రామ్‌ రీల్స్‌ని ఊచకోత కోసింది. ఇప్పుడు ఆ పాట మరో రికార్డు బద్దలు కొట్టింది. ఏకంగా 1 మిలియన్ రీల్స్‌ దాటిన మొట్టమొదటి కన్నడ మ్యూజిక్ ట్రాక్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ప్రపంచం నలుమూలల నుంచి యూజర్లు ఈ వైబ్‌కి కనెక్ట్ అయ్యి, తమదైన స్టయిల్‌లో ట్రెండ్‌ ఫాలో అవుతూ దీన్ని ఒక గ్లోబల్ సెన్సేషన్‌గా మార్చేశారు.

2025లో రిలీజ్‌ అయిన తెలుగు, హిందీ, తమిళ, మలయాళం వెర్షన్లన్నీ ఊహించని రేంజ్‌లో వసూళ్ళు రాబట్టాయి. ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాల లిస్ట్‌లో టాప్‌లో నిలిచిన ఈ చిత్రం ఇండిపెండెంట్‌గా ఎన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుందో లెక్కలేదు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ మిథికల్ డ్రామా అప్పట్లో శాండల్‌వుడ్‌ రేంజ్‌నే మార్చేసిందని చెప్పాలి. థియేటర్స్‌లో సౌండ్‌ ఎఫెక్ట్స్‌కీ, కథనానికీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే రిషబ్‌తో పాటు రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్‌గా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. జయరామ్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడ్, గుల్షన్ దేవయ్య లాంటి ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించి మూవీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం డివైన్, మిథికల్ నేపథ్యంలో సాగే ఈ కథకు కాంతార చాప్టర్ 3 త్వరలోనే సెట్స్‌పైకి రాబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూజర్‌ ఎంగేజ్‌మెంట్‌ పరంగా చూసినా, రీల్‌ కల్చర్‌లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్‌ అయింది. సినిమా ఇక ముగిసిపోయిందనుకున్నా, దాని సౌండ్‌ ట్రాక్‌ మాత్రం డిజిటల్ స్పేస్‌లో రాజ్యమేలుతూనే ఉంది. మరి కాంతార 3 ఎప్పుడు వస్తుందా అని ఆడియెన్స్ ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్న టైమ్‌లో ఇలాంటి రికార్డులు సినిమాకి ఉన్న లయఫ్‌ని మరింత పెంచుతున్నాయి.

Share your love