
Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న వ్యాల్యూ హీరోయిన్లకు ఉండదు. హీరోయిన్లను ఎక్కువగా పట్టించుకోరు. వారికి అంత స్కోప్ ఉన్న పాత్రలు కూడా ఇవ్వరు.ఏదో ఒకరో ఇద్దరు హీరోయిన్లు తప్ప మిగిలిన ఎవరికి అంత స్కోప్ ఉన్న పాత్రలు దక్కవు. అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం తీసుకునే రెమ్యూనరేషన్లు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. హీరోయిన్లకు హీరోల కంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.
The Heroine who demanded a crore for a single lip lock
హీరోలకు 100 కోట్ల రెమ్యూనరేషన్లు ఇస్తే హీరోయిన్లకు కనీసం 10 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరు.అయితే అలాంటి ఓ హీరోయిన్ కి ఏకంగా కోటి రెమ్యూనరేషన్ ఇచ్చారట.అది కూడా లిప్ లాక్ కి..ఇదేంటి 10 కోట్లతో పోలిస్తే కోటి తక్కువే కదా అని అనుకోవచ్చు. కానీ కోటి రూపాయలు ఇప్పుడు కాదు. గతంలోనే అంటే 1988 సంవత్సరంలో. ఇక లిప్ లాక్ కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరంటే మాధురి దీక్షిత్..(Heroine)
Also Read: Manchu Manoj: కొడుకంటే ఇలా ఉండాలి తండ్రిని పీక్కు తినకూడదు.. విష్ణుకి కౌంటర్ ఇచ్చిన మనోజ్.!
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్, వినోద్ ఖన్నా జంటగా నటించిన దయావన్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.అయితే ఈ సినిమా కథపరంగానే కాదు కథలో ఉన్న లిప్ లాక్ కారణంగా కూడా వైరల్ గా నిలిచింది.ఈ సినిమాలో అప్పటివరకు ఎవరు చేయని లిప్ లాక్ సీన్ ని మాధురి దీక్షిత్ చేయడంతో అప్పట్లో ఈ సీన్ గురించి చాలా మంది చర్చించుకున్నారు.

అంతేకాదు ఈ సీన్ చేయడం కోసం ఏకంగా మాధురి దీక్షిత్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది అనే ప్రచారం కూడా జోరుగా సాగింది.అయితే ఈ సినిమా హిట్ అయి మాధురి దీక్షిత్ కి పేరు వచ్చినప్పటికీ 1988లో లిప్ లాక్ సీన్ గురించి చాలా విమర్శలు ఎదురయ్యాయి. దీనివల్ల మాధురి దీక్షిత్ కి ఎలాంటి మైనస్ కాకపోయినప్పటికీ అప్పట్లో ఈ విషయంలో మాధురి దీక్షిత్ పేరు మాత్రం హాట్ టాపిక్ గా మారింది.(Heroine)




















