సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్.. విరూపాక్ష, బ్రో చిత్రాల సక్సెస్ తర్వాత సెలెక్టివ్ గా మంచి మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు. సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే.. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అందుచేత మేనమామ పవన్ సినిమా వస్తుందంటే.. మేనల్లుడు తేజ్ తన సినిమాను రిలీజ్ చేస్తాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ సెప్టెంబర్ 25 డేట్ మార్చుకుంటే అక్టోబర్ లో రిలీజ్ కు సంబరాల ఏటిగట్టు సినిమా వస్తుందని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఈ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.





