‘ఆంధ్రా కింగ్..’ పైనే రామ్ ఆశలు

హీరో రామ్ ఇటీవల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. రెడ్, వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్..ఇవన్నీ క్యూ కట్టి ఫ్లాప్ అయ్యాయి. ఈ మాస్ ఫార్ములా వదిలేసిన రామ్ ఇప్పుడు మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన క్లాస్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యంగ్ డైరెక్టర్ పి. మహేష్ బాబు ఈ మూవీని రూపొందిస్తున్నారు.

రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో రామ్ కు జంటగా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. ఈ మూవీలో రొమాంటిక్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు యాక్షన్ డోస్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాని నవంబర్ 28న రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా తనకు సక్సెస్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు రామ్.

Share your love