Sanjay Dutt: సంజయ్ దత్ జైలు జీవితం.. అంత టార్చర్ చేశారా.. వెలుగులోకి సంచలన నిజాలు!!

Sanjay Dutt: బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితం నిజంగా ఒక open book లాంటిదే. స్టార్ హీరోగా వెలుగులు నూరిన ఆయన, తర్వాత జైలు గోడల వెనుక గడిపిన రోజులు చాలా మందికి తెలియని నిజాలు. ఇటీవల తన స్నేహితుడు సునీల్ శెట్టితో కలిసి Kapil Sharma Showలో పాల్గొన్న సంజయ్, యెరవాడ జైలు (Yerawada Central Jail)లో ఎదుర్కొన్న కొన్ని షాకింగ్ సంఘటనలను పంచుకున్నారు.

Sanjay Dutt talks about dark days

1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలతో TADA Court జైలు శిక్ష విధించింది. 2013లో సుప్రీంకోర్టు కూడా శిక్షను సమర్థించడంతో, పుణేలోని యెరవాడ సెంట్రల్ జైలులో కొన్ని సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. జైలులో ఖాళీగా ఉండకుండా పేపర్ బ్యాగులు, కుర్చీలు తయారు చేస్తూ డబ్బు సంపాదించారు. అంతేకాకుండా ఖైదీల కోసం Radio YCP అనే ప్రత్యేక రేడియో స్టేషన్ కూడా నడిపారు.

జైలులో ఎదురైన ఒక భయానక అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకసారి గడ్డం గీయించుకోవడానికి సూపరింటెండెంట్ పంపిన ఖైదీని చూసి సంజయ్ “ఎందుకని ఇక్కడ ఉన్నావు?” అని అడగ్గా, అతను “డబుల్ మర్డర్” చేశానని చెప్పాడు. అది విన్న సంజయ్ “అలాంటి వ్యక్తి చేతిలో razor ఉంటే ఎలా ఉంటుంది?” అని తనదైన హాస్య శైలిలో చెప్పినా, ఆ సమయంలో తాను భయపడ్డానని ఒప్పుకున్నారు.

తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనా, పశ్చాత్తాపం (regret) ఏదీ లేదని సంజయ్ దత్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులను కోల్పోవడం తన జీవితంలోనే అతిపెద్ద బాధగా పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ‘బాఘీ 4’లో కనిపించిన సంజూ, ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘ధురందర్’ సినిమాలో నటిస్తున్నారు.

Share your love