

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ పూర్తయిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అవుతున్నారు. Telangana
Shame on the mother of Telangana
గత వారం రోజుల కిందట హైదరాబాద్ ఔట్ కట్స్ లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయాలను విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు చూపించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం పై అప్పట్లో చాలా విమర్శలు వచ్చినప్పటికీ, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా అందరూ ఆదరిస్తున్నారు. Telangana
Also Read: BRS VS Congress: ఆసుపత్రికి వచ్చిన మహిళలపై అత్యాచారం..ఆ రాజకీయ నేత భాగోతం ఇదే…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ తల్లి విగ్రహం చాలా అట్టహాసంగా కనిపించింది. కానీ ఈవెంట్ అయిపోయిన తర్వాత తెలంగాణ తల్లిని ఒంటరి చేయడమే కాదు, నేలకు ఒరిగించేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరిస్తున్నారు. సమ్మిట్ పూర్తయిన తర్వాత తెలంగాణ విగ్రహాన్ని అక్కడే కింద పడేసి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను వైరల్ చేసి గులాబీ పార్టీ విమర్శలు చేస్తోంది. తెలంగాణ తల్లికి ఇంత అవమానం జరగడం దారుణం అంటూ ఫైర్ అవుతోంది. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. Telangana
Also Read: TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, కమీషన్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?







