
DK Shivakumar: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో భాగంగా విదేశాల నుంచి పెట్టుబడులను తెలంగాణకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు విదేశీ ప్రతినిధులతో పాటు మన ఇండియాలో ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. DK Shivakumar
DK Shivakumar comments on telangana over global summit 2025
అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీసే ప్రయత్నం చేశారు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్. తమ కర్ణాటక కంటే తెలంగాణ రాష్ట్రం చాలా చిన్నదంటూ చిన్నచూపు చూపే ప్రయత్నం చేశారు. దీంతో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..DK Shivakumar
Also Read: Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?
తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్…అందరి ముందు హైదరాబాద్ ను చిన్న చూపుతో చూశారు. బెంగళూరు, కర్ణాటకలతో పోలిస్తే.. తెలంగాణ అంత పెద్ద రాష్ట్రమేమీ కాదని వ్యాఖ్యానించారు. కర్ణాటక ‘IT Exports’ 43 శాతమైతే.. తెలంగాణది తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు డీకే శివ కుమార్. దీంతో కర్ణాటకను ప్రమోట్ చేయడానికా తెలంగాణలో ప్లాట్‌ఫామ్ సెట్ చేసింది? అంటూ రాష్ట్ర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. DK Shivakumar
Also Read: CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం…





