Will KL Rahul step down from LSG captaincy for last 2 games and Lucknow

KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ లన్ని చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే యాబై కి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి. దాదాపు ప్లే ఆఫ్ జట్లు కూడా ఫైనల్ అయినట్లే. రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. KL Rahul

Will KL Rahul step down from LSG captaincy for last 2 games and Lucknow

ఇలాంటి నేపథ్యంలో లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీకి దూరంగా ఉండటమే కాకుండా లక్నో జట్టును కూడా వదిలి వేసేందుకు సిద్ధమయ్యాడట కేఎల్ రాహుల్. హైదరాబాద్ జట్టు చేతులో భారీ ఓటమి తర్వాత లక్నో సూపర్ జెంట్స్ జట్టులో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయబోడని తెలుస్తోంది. KL Rahul

Also Read: KL Rahul: KL రాహుల్‌ను బండబూతులు తిట్టిన లక్నో ఓనర్‌!

ఈ మేరకు స్వయంగా కేఎల్ రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. తన బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాడట. అలాగే 2025 ఐపీఎల్ సీజన్ కు కేఎల్ రాహుల్ ను తీసుకోకూడదని లక్నో ఓనర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. నిన్న హైదరాబాద్ జట్టుపై లక్నో సూపర్ జెంట్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. KL Rahul

ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది లక్నో సూపర్ జెంట్స్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లక్నో ఓనర్ సంజయ్ గోయంక… లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పై విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో లక్నో జట్టును వీడిపోవాలని కేఎల్ రాహుల్ కూడా నిర్ణయం తీసుకున్నాడట. దీంతో వచ్చే సంవత్సరం కె.ఎల్ రాహుల్ లేకుండానే లక్నో సూపర్ జెంట్స్ ఐపీఎల్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. KL Rahul

Join WhatsApp