KL Rahul Finds Support After Video Of Sanjeev Goenka Getting Angry On LSG Captain Goes Viral

KL Rahul: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కే ఎల్ రాహుల్ కు ఊహించని షాక్ తగిలింది. కేల్ రాహుల్ ను లక్నో ఓనర్ బండ బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఏకంగా పదవికిట్లు తేడాతో విజయం సాధించింది. KL Rahul

KL Rahul Finds Support After Video Of Sanjeev Goenka Getting Angry On LSG Captain Goes Viral

ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్… నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి…. 165 పరుగులు మాత్రమే చేసింది. కే ఎన్ రాహుల్, బదోని, నికోలస్ పురాన్ తప్ప ఏ ఒక్క బ్యాట్స్మెన్ రాణించలేదు. దీంతో అంత తక్కువ పరుగులే చేసింది లక్నో. ఇక అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు… అరి వీర భయంకరమైన బ్యాటింగ్ తో విజృంభించింది. KL Rahul

Also Read: IPL 2024: ప్రమాదంలో సన్‌రైజర్స్ హైదరాబాద్…ప్లే ఆఫ్స్‌ ఆశలు గల్లంతు ?

9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని చేదించింది హైదరాబాద్ జట్టు. హైదరాబాద్ ఓపెనర్లు… ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ భయంకరమైన బ్యాటింగ్ చేశారు. దీంతో పది వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెంట్స్ జట్టుపై విజయం సాధించింది హైదరాబాద్ జట్టు. అయితే హెడ్ మరియు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి లక్నో సూపర్ జెంట్స్ బౌలర్లు అలాగే కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా భయపడిపోయారు. ఇంత దారుణంగా ఆడుతున్నారని టెన్షన్ కు లోనయ్యారు. KL Rahul

అయితే ఈ మ్యాచ్ అనంతరం… లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా చేసిన పని ఇప్పుడు ఫ్యాన్స్ కు కోపం తీసుకొస్తుంది. లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను బండబూతులు తిట్టాడు లక్నో ఓనర్ సంజీవ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మ్యాచ్ ఇంత దారుణంగా ఆడతారా…? హైదరాబాద్ జట్టు వికెట్ ఒకటి కూడా తీయలేదా..? ఎందుకు నువ్వు కెప్టెన్సీ చేస్తున్నావు ? అని అర్థం వచ్చేలా కేల్ రాహుల్ను తిట్టాడు లక్నో ఓనర్. అయితే దీన్ని చూసిన ఫ్యాన్స్ లక్నో ఓనర్ పై ఫైర్ అవుతున్నారు. ఒక్కడు ఆడితే మ్యాచ్ గెలవదని… గెలిచిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పాత్ర ఉందని… అతన్ని తిట్టడం దారుణమని మండిపడుతున్నారు. KL Rahul

Join WhatsApp